కోలీవుడ్ హీరో అశోక్ శెల్వన్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం "ఆకాశం". తమిళంలో "నితం ఒరు వానం" అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకుడు.
నవంబర్ 4వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ ఐన ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. నాచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ఈ ట్రైలర్ యూట్యూబులో 2మిలియన్ వ్యూస్ సాధించింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా, లైఫ్ జర్నీ గా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై చాలా మంచి అంచనాలని ఏర్పరిచింది.
గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రీతూ వర్మ, శివాత్మిక రాజశేఖర్, అపర్ణా బాలమురళి హీరోయిన్లుగా నటించారు.