బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్-కాజోల్ ముద్దుల కూతురు నైస దేవ్‌గణ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న ఈ భామ వెండితెరపై మెరవాలని ఆశపడుతోందట. ఆమె కోసం కాజోల్ కథలు వింటున్నారని బీటౌన్ వర్గాల సమాచారం. మరి తల్లిదండ్రుల స్థాయిలో ఈ ముద్దుగుమ్మ రాణిస్తుందో లేదో చూడాలి.