కొంచెంసేపటి క్రితమే అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈసారి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ శర్వానంద్, అడివిశేష్ షోకు విచ్చేసి, బాలయ్యతో స్పైసీ చిట్ ఛాట్ చేసారు. శర్వానంద్, శేష్ లతో బాలయ్య క్రేజీ టాక్ సూపర్ ఫన్ అండ్ మోర్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ ఎపిసోడ్ నవంబర్ 4వ తేదీన ఆహాలో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఎపిసోడ్లో శర్వానంద్ బాలయ్యకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ను తీసుకొస్తారు. అదేంటంటే, అంతకుముందు ఎపిసోడ్ లో బాలయ్య తనకు రష్మిక మండన్నా అంటే క్రష్ ఉందని చెప్తారు కదా.... రష్మికకు వీడియో కాల్ చేసి బాలయ్యను సర్ప్రైజ్ చేసాడు శర్వానంద్. ఈ ఎపిసోడ్ లో ఈ పార్ట్ మరింత క్రేజీ గా ఉండబోతుంది.