నేడు అందానికి నిర్వచనంలా కనిపించే ఐశ్వర్యరాయ్ పుట్టినరోజు. ఐశ్వర్యరాయ్ 1973 నవంబర్ 1 న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. అందానికి అర్థంగా కనిపించే ఐశ్వర్యరాయ్.. ఆమె అందాన్ని చూస్తే మనసులేని రోబోలు సైతం ఫిదా కావాల్సిందే. అందానికి అభినయం తోడైతే.. ఆమె పేరు ఐశ్వర్య రాయ్. తన అందంతో.. నటనతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన గొప్పనటి. మోడల్‌గా కెరియర్ ను ప్రారంభించి.. మిస్ వాల్డ్‌గా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా ఆమె అందానికి కోట్లాది అభిమానులున్నారు. ఐశ్వర్యరాయ్ 1994లో మిస్ వాల్డ్‌గా ఎంపికైంది. తన అభినయంతో కోట్లాది అభిమానుల్ని సంపాదించిన గొప్ప నటి. అంతకు ముందు ఎంతోమంది అందాల పోటీలో గెలిచినా.. సినీ రంగంలో ఇంతలా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఆమె తన సినీ కెరీర్‌లో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలలో నటించింది. హిందీతో పాటు తమిళం, తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ చిత్రాలలో కూడా నటించింది. 1997లో మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'ఇరువర్'తో ఆమె కెరీర్ ప్రారంభమైంది. ఈ చిత్రం 'ఇద్దరు' పేరుతో తెలుగులోకి డబ్ చేయబడింది. నటిగా ఆమె 3వ చిత్రం 'జీన్స్'. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఐశ్వర్యరాయ్ తన మొదటి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు సౌత్ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.