టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త చిత్రం "లైక్ షేర్ సబ్స్క్రైబ్". ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. నెల్లూరి సుదర్శన్, బ్రహ్మాజీ కీరోల్స్ లో నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నిండిపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్. ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 4న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
![]() |
![]() |