FIR చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్. ఆ సినిమాతో తెలుగులో విశాల్ సూపర్ హిట్ అందుకున్నాడు. మాస్ రాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించారు.
తాజాగా విశాల్ నటిస్తున్న సరికొత్త చిత్రం "గట్టకుస్తి". తెలుగులో "మట్టి కుస్తీ" గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా రవితేజ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు విశాల్ స్టూడియోస్, ఆర్ టీ టీం వర్క్స్ బ్యానర్ పై రవితేజ, విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం పదకొండింటికి మట్టి కుస్తీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చెయ్యనున్నట్టు అధికారికంగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa