సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో మంజిమా మోహన్ తన టాలెంట్ తో మంచి పేరు సంపాదించుకుంది. ఆమె మలయాళ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. "సాహసం శ్వాసగా సాగిపో" సినిమాతో ఈ బబ్లీ బ్యూటీ టాలీవుడ్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె కథానాయకుడు, మహానాయకుడు సినిమాలలో కూడా నటించింది. గతంలో మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్‌తో డేటింగ్ అని వారు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపించాయి.
తాజాగా ఇప్పుడు, అలనాటి నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ మరియు హీరోయిన్ మంజిమా మోహన్ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. 2019లో రిలీజ్ అయినా "దేవరత్తం" సినిమాలో ఈ లవర్ బర్డ్స్ వర్క్ చేసారు. మరికొద్ది నెలల్లో పెళ్లి చేసుకుంటున్నట్టు సమాచారం కానీ ఈ న్యూస్ పై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.