ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఓరి దేవుడా' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 01, 2022, 09:09 PM

అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన "ఓరి దేవుడా" సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఓరి దేవుడా సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.98 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తమిళ రొమాంటిక్ కామెడీ "ఓ మై కడవులే" సినిమాకి అధికారక రీమేక్.

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ మిథిలా పాల్కర్ జోడిగా నటిస్తోంది. ఈ ఫాంటసీ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆశా భట్, రాహుల్ రామకృష్ణ మరియు ఇతరులు సహాయక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సౌండ్‌ట్రాక్‌లను అందించారు. పివిపి సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది.


'ఓరి దేవుడా' కలెక్షన్స్ :::::::
నైజాం - 1.81 కోట్లు
సీడెడ్ - 48 L
ఆంధ్రాప్రదేశ్ - 1.95 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 4.24 కోట్లు (7.30 కోట్ల గ్రాస్)
KA + ROI - 11 L
OS – 63 L
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ – 4.98 కోట్లు (9.00 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com