నవంబర్ 4వ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాల థియేటర్లు కళకళలాడిపోనున్నాయి. ఎందుకంటే ఈ శుక్రవారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదికిపైగా సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లకు రాబోతున్నాయి. వాటిలో హీరో నందు నటించిన "బొమ్మ బ్లాక్బస్టర్" ఒకటి.
ఇందులో యాంకర్ రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది. రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ రోడ్ లోని V కన్వెన్షన్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.