పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీ లో జరుగుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్ లో చాలా బిజీగా గడుపుతున్నారు. రీసెంట్గానే స్టార్ట్ ఐన ఈ న్యూ షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలోనే దాదాపు ఇరవై రోజులపాటు జరుగుతుందట. పోతే, ఈ షెడ్యూల్ లో పవన్ పై భీకర పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ డైరెక్షన్లో ఈ షెడ్యూల్ చిత్రీకరింపబడుతుంది. విశేషమేంటంటే, ఈ ఇరవై రోజుల్లో కేవలం ఒకేఒక్క యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట. అదికూడా పదికోట్లు ఖర్చు పెట్టి మరీ. అంటే సినిమాలో ఈ ఎపిసోడ్ కు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్ధం అవుతుంది.
క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.