బాలీవుడ్ కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా, కింగ్ ఆఫ్ బాలీవుడ్, SRK ... ఎంతమంది ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా, పలికేది మాత్రం ఒకే ఒక్కరే ... ఆయనే షారుఖ్ ఖాన్. భారతదేశంలో సూపర్ సక్సెస్ఫుల్ ఐన ఫిలిం స్టార్స్ లో షారుఖ్ ముందు వరుసలో ఉన్నారు.
ఈ రోజు షారుఖ్ 57వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ మేరకు ఫ్యాన్స్ , సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు. ముంబైలోని ఆయన స్వగృహం 'మన్నత్' నుండి అర్ధరాత్రి బయటకు వచ్చి ఆయన రాక కోసం ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్న వేలాదిమంది అభిమానులకు ఆయన అభివాదం చేసారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్, డంకి అనే సినిమాలలో నటిస్తున్నారు.