కోలీవుడ్ మూవీ ఖైదీ 2019లో విడుదలై ఎంతటి ప్రభంజన విజయం సాధించిందో తెలిసిందే. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రెండవ సినిమా ఇది. ఇందులో స్టార్ హీరో కార్తీ హీరోగా నటించి, ఢిల్లీగా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో, హీరోయిన్ లేకుండా బరిలోకి దిగిన ఈ సినిమా ను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు.
తాజాగా ఈ సినిమా హిందీలో భోళా పేరుతో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ డైరెక్టోరియల్ లో నాల్గవ సినిమాగా తెరకెక్కుతున్న ఇందులో ఆయనే హీరోగా నటిస్తున్నారు. టబు కీలకపాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ అజయ్ దేవగణ్ సరసన స్పెషల్ రోల్ లో నటిస్తుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మలయాళ భాషలలో నటించిన అమలాపాల్ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. పోతే, డిసెంబర్ నుండి భోళా షూటింగ్లో అమల పాల్గొనబోతుంది.