ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా "అవతార్". జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి, ఈ సినిమాకు ఫుల్ ఫిదా అయిపోయారు. 2009లో విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో, అన్ని భాషల్లో రికార్డుస్థాయి వసూళ్లను సాధించింది. దాదాపు పదమూడేళ్లుగా అవతార్ కలెక్షన్ల రికార్డు చెక్కు చెదరకుండా ఉందంటే ఈ సినిమా ఏ పాటి సంచలన ప్రభంజనం సృష్టించిందో తెలుస్తుంది.
దాదాపు పదమూడేళ్ల విరామం తదుపరి అవతార్ పార్ట్ 2 రాబోతుంది. ఇటీవలే అవతార్ 2 ట్రైలర్ విడుదల కాగా, తాజాగా మేకర్స్ మరొక ట్రైలర్ ను రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్ధం చేసారు. ఈ రోజు సాయంత్రం నాలుగున్నరకు అవతార్ 2 న్యూ ట్రైలర్ ప్రేక్షకులను పలకరించబోతుంది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా 160భాషల్లో విడుదల కాబోతుంది.