ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెజిఎఫ్ స‌క్స‌స్ మీట్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 28, 2018, 01:07 AM

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలమ్స్  నిర్మించిన సినిమా ‘కెజిఎఫ్’. రాక్ స్టార్ యశ్ హీరో. మిస్ దివా శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. విజయ్ కిరగందూర్ నిర్మించగా, ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ జరిగింది.
 చిత్ర కథానాయకుడు యశ్ మాట్లాడుతూ -  గొప్ప విజయం సాధించింది. నా నిర్మాతల వల్లనే ఇది సాధ్యమైంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా, బిజినెస్ సినిమా అవుతుంది అని ముందుగా నమ్మిన వ్యక్తి విజయ్ కిరగందుర్. తెలుగు లోనూ పెద్ద విజయం సాధించాం. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే డాక్టర్ రాజ్ కుమార్ చెప్పిన ‘అభిమానులే దేవుళ్ళు’ అనే మాట గుర్తుకు వస్తోంది. నా తొలి సినిమాకే ఇంత ఘనంగా వెల్కమ్ చెప్పిన తెలుగు ప్రజలు నిజమైన దేవుళ్ళు.  10 ఏళ్ల క్రితం పరిశ్రమకు వచ్చినప్పుడు కూడా నాకు ఇలాంటి వెల్కమ్ చెప్పి  ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా నన్ను ప్రేమగా అక్కున చేర్చుకున్నారు. ఈ సినిమాను ముందు నుండి నమ్మి ప్రతి ఊరిలో ప్రతిఇంటికీ తీసుకెళ్లిన అందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలకి మంచి పంపిణీదారులు అవసరం. ఆ విషయంలో నేను సాయి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాను చూసి  బూస్టప్ ఇచ్చిన ఎస్. ఎస్. రాజమౌళిగారికి నా ధన్యవాదాలు. అంత గొప్ప వ్యక్తి నా గురించి అద్భుతంగా మాట్లాడడం నిజంగా నాకు ఆశ్చర్య ం కలిగింది. ఆయన అంచనాలను ఈ సినిమా ఘన విజయం ద్వారా అందుకున్నామని అనుకుంటున్నాం. రామరాజుగారు చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమాకు ఆయన తండ్రి శ్రీ కైకాల సత్యనారాయణగారి పేరును ఇచ్చి చాలా సహాకారం అందించారు. హనుమాన్ నిజంగా నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి. ఆయన క షి వల్లనే ఈ సినిమా డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమాలా మాటలు అందించారు. ఈ సినిమా కోసం ఆయన ఐదు వెర్షన్స్‌లో డైలాగ్స్ రాసి ఇచ్చారు.  రామజోగయ్య శాస్త్రిగారు ఈ స్క్రిప్ట్‌లో ఇన్వాల్వ్ అయి పాటలు రాశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది అంటే ఆయన టేకింగ్ కారణం. భువన గౌడ గారి ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా ఉండి హాలీవుడ్ స్థాయిని గుర్తుచేసింది. శ్రీనిధి శెట్టి చాలా లక్కీ. ఒకేసారి అయిదు భాషలలో పరిచయం అయింది. తెలుగు హీరోలు చాలా గ్రేట్ వాళ్ళ డాన్సులు, ఫైట్స్ కు నేను పెద్ద అభిమానిని. తెలుగు హీరోలందరి సినిమాలు చూసి నేను తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను. వాళ్ళే  నా స్ఫూర్తి” అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa