నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఫస్ట్ టైం వ్యాఖ్యాతగా మారి హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నేషనల్ లెవెల్లో ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే కదా. మొదటి సీజన్ మొత్తం సినీతారల రాక, సినిమాల గురించే ఉంటే, రెండో సీజన్ మాత్రం కాస్తంత పొలిటికల్ టర్న్ తీసుకుంది.
ఈ మేరకు అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ స్టార్ట్ అవ్వడమే రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడిగారితో మొదలయ్యింది. దీంతోనే అర్ధమవుతుంది మేకర్స్ సెకండ్ సీజన్ ని సినీరాజకీయ హంగులతో నింపబోతున్నారని.
తాజా సమాచారం ప్రకారం, ప్రెజెంట్ ఏపీ సీఎం శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, YSRTP ప్రెసిడెంట్ YS షర్మిల గారు అన్ స్టాపబుల్ షోలో పాల్గొని బాలయ్యతో చిట్ ఛాట్ చెయ్యనున్నారని టాక్. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.