ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోయపాటి - రామ్ సినిమాలో బిగ్ బ్లాస్టింగ్ సర్ప్రైజ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 07:43 PM

టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం యువ హీరో రామ్ పోతినేనితో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్గానే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇందులో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్.


తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఒక బిగ్ బ్లాస్టింగ్ సర్ప్రైజ్ ప్రేక్షకులకు మాంఛి కిక్కిస్తుందట. ఎలా అంటారా... నటసింహం నందమూరి బాలకృష్ణగారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో స్పెషల్ క్యామియో చెయ్యనున్నారని ఇండస్ట్రీ టాక్.


బాలయ్య-బోయపాటి కాంబోలో రీసెంట్గానే అఖండ వంటి బిగ్ సూపర్ హిట్ వచ్చింది. ఇప్పుడు రామ్ - బోయపాటి సినిమాలో బాలయ్య నటిస్తున్నాడనే సరికి అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com