ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల విశేష మన్ననలను అందుకుంటుంది. RRR లో ఉన్న హై లైట్ సీన్స్ లో తారక్ పులితో ఫైట్ చేసే ఎపిసోడ్ కూడా ఒకటి. దీనికి నందమూరి అభిమానులు, ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది.
ఇప్పుడలాంటి ఎపిసోడ్ నే పుష్పరాజ్ చేత కూడా చేయించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. బ్యాంకాక్ అడవుల్లో జరగబోయే కీలక యాక్షన్ సీక్వెన్సెస్ లో భాగంగా టైగర్ ఫైట్ సీన్ ను చిత్రీకరించబోతున్నారట. ఈ మేరకు ఒక పులిని కూడా ఇప్పటికే ట్రైన్ చేయిస్తున్నారట. పోతే, నవంబర్ సెకండ్ వీక్ నుండి పుష్ప ది రూల్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.
రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.