లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన 'విక్రమ్' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు లోకేష్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో నివిన్ పౌలీ, విశాల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఎలాంటి ప్రకటన ఇవ్వనప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే, విజయ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో చేస్తున్న 'తలపతి 66' సినిమాను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.