వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తెలుగు ద్విభాషా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళంలో "వాతి" అని తెలుగులో "సర్" టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాలోని మొదటి సింగిల్‌ని ధనుష్ స్వయంగా రాశాడని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఇప్పుడు ఈ వారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ రానుందని మ్యూజిక్ కంపోజర్ జి.వి.ప్రకాష్ కుమార్ ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది అని సమాచారం.
ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.