'కృష్ణ వ్రింద విహారి'తో గ్రాండ్ కంబ్యాక్ సక్సెస్ అందుకున్న టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య లేటెస్ట్ గా తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు.
నాగశౌర్య కెరీర్ లో 24వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ను అరుణాచలం SS అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చెయ్యనున్నారు. వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని Ch. శ్రీనివాసరావు, Ch. విజయ్ కుమార్, Dr. Ch. అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. పోతే ఈ మూవీ పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుంది. ఈ మేరకు నాగశౌర్య ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే పనిలో బిజీగా ఉన్నారు.