అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబిసిడి. మలయాళంలో సూపర్ హిట్ మూవీకి ఇది రీమేక్.. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతన్నాడు.. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మధుర శ్రీధర్, బిగ్‌బెన్ సినిమాస్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కర్నాటకకు చెందిన జుధా సాంధీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ని. మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ చిత్రానికి సంగీతం జుధా సాంధీ, నిర్మాతలు మధుర శ్రీధర్, యష్.రంగినేని, దర్శకత్వం సంజీవ్ రెడ్డి. మలయాళంలో చేసిన దుల్కర్ సల్మాన్ కి ఈ సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లు శిరీశ్ కి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa