సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్' అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ 22న చెన్నై, ఈస్ట్ కోస్ట్ రోడ్ మరియు ఎన్నూర్లలో ప్రారంభమైందని సన్ పిక్చర్స్ ప్రకటించింది. రెండు దశల్లో జరపాలని నిర్ణయించుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం 50 శాతం పూర్తయింది. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa