బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్"ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆదిపురుష్ 2023 జనవరి 12న భారీ స్థాయిలో విడుదల కానుంది అని సమాచారం.
గత కొన్ని రోజులుగా, మూవీ మేకర్స్ ప్రభాస్ నటించిన కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ పుకార్లన్నీ ఫేక్ అని, రీషూట్ ప్రక్రియ జరగడం లేదని మూవీ మేకర్స్ వెల్లడించారు. ప్రొడక్షన్ పనులు మరియు విఎఫ్‌ఎక్స్‌తో మేకర్స్ బిజీగా ఉండగా, రాజమౌళి బాహుబలి కంటే 100 రెట్లు ఎక్కువ వీఎఫ్‌ఎక్స్‌తో ఈ చిత్రం ఉందని సమాచారం. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 400 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం.