సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో సమంత రూత్ ప్రభు ఒకరు. హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ డైరెక్షన్ లో సామ్ 'యశోద' ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న యశోద మూవీ నవంబర్ 11, 2022న థియేటర్లలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యశోద సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో సమంత నటన కీలకం కానుంది అని అంతేకాకుండా ఛేజింగ్ సీక్వెన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ట్విస్ట్‌లు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయని ఈ చిత్రానికి సామ్ యొక్క విన్యాసాలు, ఆమె ఎమోషన్స్ హైలైట్‌గా ఉంటాయి అని లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.