టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2023కి వాయిదా పడినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని మేకర్స్ వెల్లడించారు కానీ వీరసింహారెడ్డి ఇంకా షూటింగ్ పూర్తి చేయకపోవడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు.