టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ ఒక సినిమా మొదలుపెట్టారు. అయితే తాజాగా అర్జున్ విశ్వక్‌సేన్‌పై కీలక వ్యాఖలు చేసారు. ఈ సినిమా షూటింగ్ మూడు నెలల క్రితమే మొదలైంది. అయితే కారణం తెలియరాలేదు కానీ, విశ్వక్‌సేన్ షూటింగ్‌కి హాజరుకాలేదు. దీంతో షూటింగ్‌కి రావాల్సిందిగా ఎన్ని ఫోన్లు చేసినా విశ్వక్‌సేన్ స్పందించలేదు అని అర్జున్ తెలిపారు. అంతేకాదు గతంలో ప్రకటించిన షెడ్యూల్ మార్చుకున్నా.. షూటింగ్ కి రానని విశ్వక్సేన్ చెబుతున్నాడు. అంతేకాదు ఈ విషయంపై మాట్లాడేందుకు విశ్వక్‌సేన్ ను పిలిస్తే... ఆయన ఏమాత్రం స్పందించలేదు అని అన్నారు. విశ్వక్‌సేన్‌కి చేసినంత కాల్స్ తన జీవితంలో ఎవరికీ చేయలేదన్నారు. దీనిపై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేస్తానని అర్జున్ తెలిపారు.