కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అల్లరి నరేష్ నటిస్తున్న కొత్త చిత్రం "ఉగ్రం". అల్లరి నరేష్ సినీ కెరీర్ లో అరవైవ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విషయమై లేటెస్ట్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వార్తలను బట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఉగ్రం రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.