SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' సినిమా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబటింది. తాజాగా ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా జాపనీస్ బాక్సాఫీస్ వద్ద 204 మిలియన్ యెన్‌లను వసూలు చేసింది. దింతో ఈ చిత్రం ఇప్పుడు $3 మిలియన్లు వసూళ్లు చేసి జపనీస్ బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ లీడింగ్ ఇండియన్ ఫిల్మ్ గా ఉన్న ముత్తుని బీట్ చేసే దిశగా ఉన్నట్లు సమాచారం.
ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్,సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.