ఇటీవలే విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల అటెన్షన్ ను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న హిట్ 2 చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ "ఉరికే ఉరికే" వీడియో సాంగ్ విడుదలైంది. సిద్ శ్రీరామ్, రమ్య బెహరా ల వాయిస్ లో ఈ పాట పీస్ ఫుల్ రొమాంటిక్ మెలోడీ గీతంగా శ్రోతలను అలరిస్తుంది. ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందించారు. నిన్న విడుదలైన ఈ పాటకు యూట్యూబులో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైం మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. రావురమేష్, కోమలి ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నారు.