హాట్ బ్యూటీ పాయల్ రాజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "మాయాపేటిక". సునీల్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, పృథ్వి రాజ్, శ్రీనివాసరెడ్డి, హిమజ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ గ్లిమ్స్ విడుదలై, ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. మొబైల్ ఫోన్ వచ్చిన తరవాత జనాలు సూర్యోదయం, సూర్యాస్తమయం అనే విషయాలను మర్చిపోయారు... అనే డైలాగ్స్ తో మొదలైన ఈ గ్లిమ్స్ వీడియోకు హీరో రాణా వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. దేవుడిచ్చిన ప్రాణాలు వదిలేసేవే ఐతే, మనిషి వదల్లేని ప్రాణంగా మారిన మొబైల్ ఫోన్ మనుషుల జీవితాలలో ఎంతటి ముఖ్యపాత్రను పోషిస్తుంది, జనాలు ఫోన్లకు ఎంతగా అడిక్ట్ అయిపోయారు, దానివల్ల మన జీవితాలు ఎంతలా ప్రభావితం అవుతున్నాయనే విషయాలతో ఈ సినిమా తెరకెక్కినట్టు గ్లిమ్స్ వీడియో ను బట్టి తెలుస్తుంది.
రమేష్ రాపర్తి ఈ సినిమాకు దర్శకుడు కాగా, గుణ బాల సుబ్రహ్మణ్యం సంగీతం అందించారు. శరత్ చంద్రా రెడ్డి, తారక్ నాధ్ ఈ సినిమాను నిర్మించారు.