యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే "ఓరి దేవుడా" సినిమాతో ప్రేక్షకులను పలకరించి విశేషంగా మెప్పించారు. డీసెంట్ టాక్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇరవై రోజుల వ్యవథిలోనే సైలెంట్గా డిజిటల్ స్ట్రీమింగ్ కొచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆహా ఓటిటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ 'ఓ మై కడవులే' కి అఫీషియల్ రీమేక్. అశ్వత్ మరిముత్తు ఈ సినిమాకు దర్శకుడు కాగా, విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.