అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కేరళ స్టోరీ'. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ పై వివాదం మొదలైంది. సినిమా కేరళ గౌరవాన్ని దెబ్బతీస్తుందని కేరళ వాసులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ కేరళలో కలకలం రేపుతోంది. కేరళకు చెందిన 32,000 మంది అమ్మాయిలు ఆఫ్ఘన్ జైళ్లలో ఉగ్రవాదులుగా మగ్గుతుండటం టీజర్‌లో అసలు వివాదానికి తెరతీసింది.కేరళ అమ్మాయిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విజయన్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయడంతో చిత్ర యూనిట్ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.