ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సంవత్సరం వీళ్ళకే బాగా క‌లిసొచ్చింది

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 03:45 PM

కొంద‌రి కెరీర్‌కు కొన్ని సంవ‌త్స‌రాలు బాగా క‌లిసొస్తాయి. నాని, దిల్ రాజు లాంటి వాళ్ల‌కి 2017 క‌లిసొచ్చిన‌ట్లు.. అలాగే తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా 2018 కొంద‌రికి బాగా క‌లిసొచ్చింది. ఎలా అంటే అప్ప‌టి వ‌ర‌కు ఏదో అలా అలా ఉన్న వాళ్లు 2018లో స‌ర్ ప్రైజింగ్ స్టార్స్ అయిపోయారు. వాళ్ల గురించే ఈ ఏడాది ఎక్కువ‌గా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. అంతేకాదు వాళ్లు నటించిన సినిమాల గురించి గూగుల్ సర్చులు కూడా భారీగానే జరిగాయి. అలాంటి వాళ్లు బాగానే ఉన్నారు ఈ సారి. మ‌రి వాళ్లెవ‌రో చూసేద్దాం..


ర‌ష్మిక మంద‌న్న‌:ఈ ఏడాది మోస్ట్ స‌ర్ ప్రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయ‌ర్ ర‌ష్మిక మంద‌న్న‌. అస‌లు ఈ భామ గురించి ఈ ఏడాది చాలా చాలా మాట్లాడుకున్నారు. గూగుల్ స‌ర్చ్ లో కూడా అమ్మ‌డు టాప్ ప్లేస్ లో ఉంది. ఈమె గురించే ఎక్కువ‌గా అంతా స‌ర్చ్ చేసారు కూడా. క‌న్న‌డ‌లో కిరిక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక‌.. తెలుగులో ఛ‌లో, గీత‌గోవిందం సినిమాల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. దేవ‌దాస్ ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో స‌ర్ ప్రైజింగ్ స్టార్ ఆఫ్ 2018గా నిలిచింది ఈ క‌న్న‌డ క‌స్తూరి.


కైరా అద్వాని:మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఆ హీరోయిన్ స్టార్ కాక‌పోతే ఇంకేం అవుతుంది. కైరా అద్వానీకి కూడా ఈ అదృష్ట‌మే వ‌రించింది. భ‌ర‌త్ అనే నేనులో ఈ భామ న‌టించింది. ఆ సినిమా హిట్ అయ్యేస‌రికి ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామలోనూ ఆఫ‌ర్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆడిందంటే దెబ్బ‌కు కైరా తెలుగులో సెటిల్ అయిపోవ‌డం ఖాయం. స‌ర్ ప్రైజింగ్ కే స‌ర్ ప్రైజింగ్ గా నిలిచింది కైరా ఈ ఏడాది.


 


వెంకీ అట్లూరి: న‌టుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ద‌ర్శ‌కుడిగా మారి.. స‌ర్ ప్రైజింగ్ స్టార్ అయ్యాడు వెంకీ అట్లూరి. ఈయ‌న ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు అంటే ముందంతా ఏమో అనుకున్నారు కానీ తొలిప్రేమ సినిమాతో త‌న స‌త్తా చూపించాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. తొలిప్రేమ లాంటి క్రేజీ టైటిల్ తీసుకుని దాన్ని పాడు చేయ‌కుండా అద్భుత‌మైన సినిమా చేసాడు. వ‌రుణ్ తేజ్ కోరుకుంటున్న మ‌రో విజ‌యం అందించాడు. ఈయ‌న ఇప్పుడు మిస్ట‌ర్ మ‌జ్ను అంటూ అఖిల్ కు హిట్టిచ్చే ప‌నిలో ప‌డ్డాడు.


 


పాయ‌ల్ రాజ్ పుత్: 2018 స‌ర్ ప్రైజింగ్ స్టార్ లిస్టులో ఉన్న మ‌రో స్టార్ పాయ‌ల్ రాజ్ పుత్. ఈమె కూడా ఈ ఏడాది స‌డ‌న్ స్టార్ అయిపోయింది. ఆర్ఎక్స్ 100 వ‌చ్చే వ‌ర‌కు క‌నీసం పాయ‌ల్ అంటే ఎవ‌రో కూడా తెలియ‌దు ప్రేక్ష‌కుల‌కు. కానీ ఒక్క సినిమాతో అమ్మ‌డు హాట్ స్టార్ అయిపోయింది. ఈమె గురించి స‌ర్చ్ చేయ‌డ‌మే కాదు.. ఇప్పుడు గూగుల్ ట్రెండింగ్ లో కూడా ఉంది పాయ‌ల్. తెలుగులో ఇప్పుడు ర‌వితేజ‌తో పాటు మ‌రో రెండు సినిమాలు ఈ భామ ఖాతాలో ఉన్నాయి.


 


అడ‌వి శేష్: ఇండ‌స్ట్రీలో ఎవ‌రి జాత‌కం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌డం క‌ష్టం. అలాగే అడ‌వి శేష్ కూడా. పంజా, బాహుబ‌లి లాంటి సినిమాల్లో విల‌న్ రోల్స్ వేసిన ఈయ‌న క్ష‌ణం సినిమాతో హీరో అయ్యాడు. కానీ ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. గాలివాటం అనుకున్నారు కానీ ఈ ఏడాది గూఢ‌చారి సినిమాతో తానేంటో చూపించాడు. స్క్రీన్ ప్లే రైట‌ర్ గానే కాకుండా న‌టుడిగా కూడా గుర్తింపు తెచ్చుకుని సర్ ప్రైజింగ్ స్టార్ ఆఫ్ 2018గా నిలిచాడు శేష్. ఇప్పుడు గూఢ‌చారి 2 చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు అడ‌వి శేష్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa