సూపర్ స్టార్ కృష్ణ మృతితో టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కృష్ణ ఎంతో మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత జయప్రదకే దక్కుతుంది. కృష్ణతో కలిసి ఆమె ఏకంగా 45 చిత్రాల్లో నటించారు. ఒక హీరో హీరోయిన్ ఇన్ని సినిమాల్లో నటించడం ఇదే రికార్డు. తాను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు కృష్ణ తనకు ఎంతో సపోర్ట్ చేసారని ఆమె గుర్తుచేసుకుంటూ ఉంటారు.