సూపర్ స్టార్ కృష్ణ గారి ఆకస్మిక మరణంతో ఈ రోజు మధ్యాహ్నం 12: 10 నిమిషాలకు విడుదల కావాల్సిన కోలీవుడ్ సెన్సేషన్ "లవ్ టుడే" తెలుగు ట్రైలర్ విడుదల వాయిదా పడినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. లేకుంటే ఈపాటికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతులమీదుగా లవ్ టుడే తెలుగు ట్రైలర్ విడుదల అయ్యి ఉండేది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుగారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ప్రశాంత్ రంగనాథన్ డైరెక్షన్లో యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.