ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ‌న‌సేన ప్ర‌చారానికి మెగా కుటుంబం ర‌డీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 01, 2019, 01:48 PM

జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు త‌ను సిద్ధంగా ఉన్నాన‌ని సినీనటుడు,  పవన్  అన్నయ్య నాగబాబు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సినీ ప్రస్తానం నుంచి రాజకీయాల్లోకి  వెళ్లిన  పవన్ కళ్యాణ్  తమ తమ్ముడవ్వడమే పెద్ద మైనస్ గా త‌యారైయ్యిందని  త‌న అభిప్రాయంగా చెప్పారు.   రాజకీయ జీవితంలో   మెగా కుటుంబం ఏనాడు  ఎవరిని ప్రత్యేకంగా పిలుపునిచ్చి పార్టీకోసం ప‌నిచేయాల‌ని కోర‌దు. అలాగే త‌న త‌మ్ముడు ప‌వ‌న్ కూడా తన పార్టీ అవసరాల కోసం ప్రచారం కానీ సాయం కానీ చెయ్యమని ఎవ‌రినీ అడ‌గ‌లేద‌ని, అన్నారు.
బయట పవన్ జీవితం వేరు అని,అతని యొక్క పార్టీ సిద్ధాంతాలు ఇతర రాజకీయ నాయకుల్లో లేని నిజాయితీ తమకి కనిపించాయి  ఇది  తన తమ్ముడనో లేక ఒకే కుటుంబం అని చెప్పో మేము మా కుటుంబ సభ్యులు పవన్ కి మద్దతు ఇవ్వడం లేదని, వాడు కేవలం మా ఇంటి వరకే తనకి తమ్ముడ‌ని విమ‌ర్శించే వారు తెలుసుకోవాల‌ని అన్నారు.  గ‌తంలో నేను ఆర్ధికంగా ఇబ్బందుల్ల‌లో ఉన్న‌ప్పుడు ప‌వ‌న్ ఆదుకుకున్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ కోసం ఏదైనా చేసే ప‌రిస్థితి నాకు వ‌చ్చింది.  వరుణ్ కి సినిమాలు, నాకు ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవడం వ‌ల్ల ఏం చేయాల‌ని ఆలోచించిన త‌రుణంలో అమ్మ జ‌న‌సేన‌కు విరాళం ఇచ్చింది. నిజాయితీగా ప‌నిచేయాల‌నుకునే నేత‌కు, ఆ పార్టీ ముందుకు సాగేందుకు విరాళం ఖ‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించి నేను వ‌రుణ్‌ విరాళాలు ఇచ్చామని తెలిపారు.
ప‌వ‌న్‌ పిలుపునిస్తే త‌మ కుటుంబంలోని ప్ర‌తిఒక్క‌రూ   జనసేన తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఇప్ప‌టికే తాను ,  వరుణ్ తేజ్ జనసేన పార్టీ తరపున ప్రచారం చెయ్యాలి అని  నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స్ప‌ష్టం చేసారు నాగ‌బాబు


7






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa