ప్రజలు సినిమా తారలను దేవతలుగా ఆరాధిస్తారని, దేవతలు పూజింపబడాలి కానీ… ప్రజల మధ్యకు వెళ్ళి తిరస్కరణకు గురి కాకూడదని, పవన్ మనస్తత్వం రాజకీయాలకు సరిపోదని అభిప్రాయపడ్డారు. ఎవ్వరూ మార్చలేని రాజకీయాల్లోకి వెళ్ళి పవన్ ఏం సాధిస్తాడని సీనియర్ సినీ నటి జమున ప్రశ్నించారు.
చిరంజీవికి రాజకీయాల్లోకి వెళ్లొద్దంటూ తాను అప్పట్లో సలహా ఇచ్చానని.. అయితే చిరంజీవి మాత్రం తన సలహా విని నవ్వి ఊరుకున్నాడని.. రాజకీయాల్లో వచ్చాక చిరంజీవి ఏం సాధించాడు.. ఆయన పరిస్థితి ఏమైంది అందరికీ తెలిసిందేగా, అందుకే నాడు చిరంజీవిని రాజకీయాల్లోకి వెళ్ళొద్దని తాను సలహా ఇచ్చానని అన్నారు.
ఒకప్పుడు రాజకీయాలు గౌరవప్రదంగా, సేవా దృక్పథంతో ఉండేవని… ఇప్పుడు మాత్రం రాజకీయాలు అంటే బిజినెస్ లా మారిపోయింది జమున అన్నారు.ప్రస్తుతం రాజకీయాల్లో గెలవాలంటే 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టాలని, ఒకవేళ అదృష్టం కలిసొచ్చి గెలిస్తే… ఆ తరువాత వందల కోట్లు ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తారని, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత… తనతోపాటు కృష్ణ, కృష్ణంరాజు రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొందినా.. తమలో ఎవ్వరికీ రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉండేది కాదని స్పష్టం చేశారు.
ఇక మెగాస్టరా్ చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సీనియర్ నటి జమున చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa