ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మిస్టర్ మజ్ను’టీజ‌ర్ : అఖిల్ చెప్పిన డైలాగ్ కి యూత్ ఫిదా

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 03, 2019, 08:53 AM

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో అఖిల్ ప్లేబోయ్ గా న‌టిస్తున్నాడు.. టీజ‌ర్ లో కూడా ఈ సీన్స్ ను ఉంచారు.. దీంతో పాటే యాక్ష‌న్ దృశ్యాల‌ను చూపారు.. స్ట్రెస్ త‌గ్గాలంటే హ్యుమ‌న్ ట‌చ్ ఉండాల‌ని అఖిల్ చెప్పిన డైలాగ్ కి యూత్ ఫిదా అవుతున్నారు.. మీరూ ఈ టీజ‌ర్ ను చూడండి.


అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa