నూతన సంవత్సర వేడుకల కోసం ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు తమ ఫ్యామిలీస్‌తో కలిసి వేరు వేరు ప్రాంతాలకి వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన తల్లి, సోదరితో కలిసి వెస్టర్న్ యూరప్‌కు వెళ్లారు. అక్కడి ఇంగ్లిష్ ఛానెల్ సముద్రంలో ఈత కొట్టారు. ప్రస్తుతం వాతావరణం మైనస్ జీరో డిగ్రీలు ఉండగా, ఆ సమయంలో బికినీ వేసుకొని ఈత కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంగ్లిష్ ఛానెల్‌లో ఈత కొట్టడానికి సాధారణంగా ఎవ్వరూ సాహసం చేయరు. కాని కత్రినా తన ఫ్యామిలీతో ఇలాంటి సాహసం చేయడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. కత్రినా చివరిగా జీరో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ సరసన భారత్ అనే సినిమాలో నటిస్తుంది.
Katrina Kaif Greets New Year By Swimming In Freezing English Channel With Sisters @KatrinaKaifFB @KatrinaKaifSRK @KatrinaKaifKaty @KatrinaKaifFanz @katrinakaif_4 @KatrinaKaifInn https://t.co/6ZH2CAfmPt pic.twitter.com/4liAFIgvpm
— News World India (@NewsWorldIN) January 2, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa