ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య నిర్ణయం సరైనదే

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 03, 2019, 11:00 AM

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలయ్యబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ విషయమై స్పందించిన గోపాలకృష్ణ.. ఈ బయోపిక్ రెండు భాగాలుగా తీయాలనే నిర్ణయానికి రావటమే గొప్ప విజయమని చెప్పారు. ఈ నిర్ణయంతోనే బాలయ్య గెలిచేశారని పేర్కొన్నారు. ఒకే భాగంలో ఈ బయోపిక్ తీసుంటే ప్రేక్షకుల్లో అసంతృత్తి మిగిలేదని ఆయన అన్నారు.
రెండు భాగాలకు ”కథానాయకుడు, మహానాయకుడు” టైటిల్స్ బాగా యాప్ట్ అయ్యానని అన్నారు పరుచూరి. రెండు భాగాలు కేటాయించటం వల్ల మొత్తం ఐదు గంటల సమయం దొరికిందని, ఈ ఐదు గంటల్లో ఎన్టీఆర్ జీవితంలో మనకు తెలియని ఎన్నో సంఘటనలు చూడబోతున్నామని ఆయన చెప్పారు. తనని తాను మళ్లీ మరోసారి ఆవిష్కరించుకోవడానికి అన్నగారే బాలయ్యను పూనారని అనిపిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ.
క్రిష్ దర్శకత్వంలో స్వయంగా బాలయ్య బాబే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటిభాగం ‘కథానాయకుడు’ జనవరి 9న, రెండో భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో బాలకృష్ణ, విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ , హన్సిక, పాయల్ రాజ్‌పుత్ లాంటి భారీ తారాగణం నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa