రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిన్న ముంబై వెళ్లారు. అక్కడి మెహబూబ్ స్టూడియోలో జరగబోయే థంబ్స్ అప్ యాడ్ షూట్ లో పాల్గొననున్నారు. ఐతే, ఇందుకోసం మాత్రమే విజయ్ ముంబైకి వెళ్లలేదని, అక్కడ ఒక బాలీవుడ్ డైరెక్టర్ తో కథాచర్చలు కూడా జరపడానికే ముంబై వెళ్లారని టాక్ నడుస్తుంది. ప్రెస్టీజియస్ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తో విజయ్ ఒక సినిమా చెయ్యబోతున్నాడని వినికిడి.
లైగర్ డిజాస్టర్ తో కాస్త సైలెంట్ ఐన విజయ్, ప్రస్తుతం ఏ ఒక్క కొత్త ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చెయ్యలేదు. శివ నిర్వాణ డైరెక్షన్లో "ఖుషి" మాత్రమే ప్రస్తుతం విజయ్ చేతిలో ఉన్న సినిమా. పూరి డైరెక్షన్లో ఎనౌన్స్ చెయ్యబడిన "JGM" ఉందా ? లేదా? అన్నది ఎవ్వరికీ తెలియట్లేదు.