"జాతిరత్నాలు" సూపర్ హిట్ తదుపరి డైరెక్టర్ కేవీ అనుదీప్ నుండి వచ్చిన సరికొత్త చిత్రం "ప్రిన్స్". కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటించారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషలలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించుకునే కలెక్షన్లను వసూలు చేసింది.
లేటెస్ట్ గా ప్రిన్స్ మూవీ డిజిటల్ లో సందడి చెయ్యడం మొదలుపెట్టింది. నిన్న అర్ధరాత్రి నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రిన్స్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.
మారియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్ కీరోల్ ప్లే చేసారు. థమన్ సంగీతం అందించారు.