నటసింహం నందమూరి బాలకృష్ణ గారి నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "వీరసింహారెడ్డి". గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. అతి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి, వచ్చే జనవరి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.
తాజా బజ్ ప్రకారం, వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ డీసెంట్ ఎమౌంట్ కి కొనుగోలు చేసిందని వినికిడి. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. అలానే శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకుందట.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.