ఈ ఏడాది "వలిమై"తో ప్రేక్షకులను పలకరించి, సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ కుమార్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తునివు". వలిమై ను డైరెక్ట్ చేసిన హెచ్. వినోద్ ఈ సినిమాకు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, తునివు USA రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సరిగమ సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. RRR, KGF 2, PS 1... బ్లాక్ బస్టర్ సినిమాలను USA లో డిస్ట్రిబ్యూట్ చేసింది ఈ కంపెనీనే.
మంజూ వారియర్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.