నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "హిట్ 2". ఇందులో యంగ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతున్న హిట్ 2 సినిమా లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుని, 'A' సర్టిఫికెట్ పొందింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
రావురమేష్, తనికెళ్ళ భరణి, శ్రీనాధ్ మాగంటి, కోమలిప్రసాద్ కీలకపాత్రల్లో నటించారు.