జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "రుద్రంగి". వీరిద్దరి మోషన్ పోస్టర్స్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన ఈ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం ఐదున్నరకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ రివీల్ కాబోతుంది.
ఈ సినిమాను అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై బాలకిషన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.