అక్కినేని నాగచైతన్య గత కొంతకాలంగా హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. తాజాగా వీరిద్దరూ కలిసి శుక్రవారం రోజు సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా వారు
ఫోటోకు ఫోజిచ్చారు. ఈ తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైతూ, శోభిత డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు ఈ ఫోటో మరింత బలాన్ని చేకూర్చింది. మరోవైపు సమంత అనారోగ్యంతో బాధపడుతుంటే, నాగచైతన్య కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఆనందంగా గడుపుతున్నాడని సమంత అభిమానులు చైతూను విమర్శిస్తున్నారు.