కొన్నేళ్లుగా సినీ హీరో ప్రభాస్ పెళ్లి వాయిదా వేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఆయనను పెళ్లి చేసుకోవాలని ఉందని బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పేర్కొంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఆమె నటించింది. ఆమె నటించిన మరో సినిమా భేడియా (తెలుగులో తోడేలు) శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ 3 ఆప్షన్లు ఇవ్వగా టైగర్ ఫ్రాఫ్‌తో డేటింగ్, కార్తీక్ ఆర్యన్‌తో ఫ్లర్టింగ్ చేస్తానని తెలిపింది. ఛాన్స్ వస్తే ప్రభాస్‌తో పెళ్లి అని వ్యాఖ్యానించింది. దీంతో తమకు వదిన దొరికిందని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.