ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిట్ 2 థీమ్ సాంగ్ 'పోరాటమే' లిరికల్ సాంగ్ రిలీజ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 12:04 PM

హిట్ 2 సినిమా నుండి ఉరికే ఉరికే రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ రీసెంట్గానే రిలీజై చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ 'పోరాటమే' లిరికల్ సాంగ్ ను విడుదల చెయ్యడం జరిగింది. హిట్ 2 డైరెక్టర్ శైలేష్ కొలను ఈ పాటను పాడడం విశేషం. కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, సురేష్ బొబ్బిలి స్వరపరిచారు.


శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ళ భరణి, కోమలి ప్రసాద్ కీలకపాత్రల్లో నటించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.


వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లకు రాబోతుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa