మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న నటి సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించిందని, చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తున్నారని నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. ఈ ఊహాగానాలను కొట్టిపారేసిన సామ్ టీమ్ ఎలాంటి సమాచారం లేకుండా ఒకరి ఆరోగ్యంపై ఏది పడితే అది ఎలా రాస్తారని మండిపడింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపింది. ఆమె ఆరోగ్యంపై వదంతులు సృష్టించొద్దని కోరింది.